ఈ పేస్ట్ లో దీనిని కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Hair Growth Tips In telugu : జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో దొరికే వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మార్కెట్ లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

అరకప్పు కలబంద ముక్కలు,గుప్పెడు కరివేపాకు ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.

కలబంద జుట్టుకి మంచి కండిషనింగ్ గా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా ఉండేలా చేయటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కరివేపాకు,ఆలోవెరా సులభంగా అందుబాటులో ఉంటాయి.

ఇక పెరుగులో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగ టానికి సహాయపడటమే కాకుండా జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే ఒత్తైన జుట్టును పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.