డయాబెటిస్ ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఏమి అవుతుందో తెలుసా?

cumin seeds diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
jeelakarra Health Benefits in telugu
జీలకర్రను రెగ్యులర్ గా వంటల్లో వాడుతూ ఉంటాం. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన జీలకర్ర ఆకలిని పుట్టించటానికి మరియు జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండుట వలన డయాబెటిస్ నియంత్రణలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ (డయాబెటిస్ ఉన్నవారిలో గుండెకు హాని కలిగించే కొవ్వులు) స్థాయిలను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. జీలకర్ర నీరు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తాగవచ్చు.

అలా కాకుండా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ జీలకర్ర వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.