తలలో దురద,చుండ్రు ఎక్కువగా ఉందా…అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Head itching In Telugu :తలలో దురద అనేది చుండ్రు,పేలు,దుమ్ము,ధూళి కారణంగా వస్తుంది. తరచుగా తలలో దురద వస్తూ ఉంటే చికాకు, ఇరిటేషన్ వంటివి వస్తాయి. దురద తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే దురద సమస్య నుండి బయట పడవచ్చు.
మందారపువ్వు,మందార ఆకులను కలిపి మెత్తని పేస్ట్ గా చేసి తలకు, కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే దురద సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
బాదం పప్పులను పొడిగా చేసుకొని దానిలో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే దురద సమస్య నుండి బయట పడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
బీట్ రూట్ జ్యూస్ లో గోరింటాకు పొడి,పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే దురద సమస్య తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. తలలో దురద,చుండ్రు సమస్యలు ఉన్నప్పుడు మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఇలా ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.