Healthhealth tips in telugu

నరనరాల్లో బలం పెరిగి నరాల బలహీనత, ఒత్తిడి తగ్గి మెదడు మెరుపు వేగంతో పనిచేస్తుంది

Reduces Nerve Weakness : ఈ రోజు అశ్వగంధ విత్తనాల గురించి తెలుసుకుందాం. ఈ గింజలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. Ashwagandha seeds లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మందికి కోపం, నిరాశ, చిరాకు, ఒత్తిడి మరియు ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి అడ్రినల్ హార్మోన్‌, కార్టిసాల్ హార్మోన్‌ లు కారణం అని చెప్పాలి.

ఈ రెండు హార్మోన్స్ ని నియంత్రణలో ఉంచి మనస్సు ప్రశాంతంగా ఉండటానికి Ashwagandha seeds సహాయపడతాయి. కొన్ని సార్లు రోగనిరోధక వ్యవస్థ హైపర్ యాక్టివ్ అవుతుంది. అశ్వగంధలో ఉండే స్టెరాయిడ్ లాక్టోన్లు మరియు స్టెరాయిడ్ గ్లైకోసైడ్లు అనే రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను మామూలు స్థితికి తీసుకువస్తాయి. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి వ్యతిరేకంగా పని చేయకుండా నిరోధిస్తుంది.

అందువల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారించటంలో సహాయపడుతుంది. కడుపు, ప్రేగులో ఏర్పడే అల్సర్స్ ని తగ్గించటానికి సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడుకు, నరాలకు కూడా మేలు జరుగుతుంది. ఇది GABA మరియు మైమెటిక్ కార్యకలాపాలను పెంచుతుంది. నరాలు క్షీణించిన దశలోకి వస్తే, అది వాటిని పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
Brain Foods
అంతేకాకుండా నరాల కణాల నష్టాన్ని నివారిస్తుంది. నరాల బలహీనత తగ్గుతుంది. అలాగే Ashwagandha seeds ఆయుష్షును పెంచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. వీటిలో ఉండే గ్లైకో అమినోగ్లైకాన్స్ కణాల మైటోకాండ్రియాలో మార్పులను తీసుకువస్తుంది.శక్తి సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. అందుకే అశ్వగంధ తీసుకోవడం వల్ల కణాలలో శక్తి ఉత్పత్తి పెరుగుతుంది.
Ashwagandha-powder
అందువల్ల చురుకుగా మరియు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. అశ్వగంధ పొడిని తేనెలో కలిపి తీసుకోవచ్చు. అలాగే వేడి నీటిలో కలిపి తీసుకోవచ్చు. అలా కాకుండా పాలల్లో కలిపి తీసుకోవచ్చు. అలా తీసుకోవటం కుదరని వారు కూరల్లో చల్లుకొని తినవచ్చు. అశ్వగంధ పొడిని తీసుకుంటే అశ్వం అంతా శక్తి వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.