1 గ్లాస్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా…మరెన్నో ప్రయోజనాలు

Super Immunity drink : వర్షాకాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లేకపోతే ఎన్నో సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవటమే కాకుండా సీజనల్ వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.
Horse Gram benefits
కాస్త ఓపికగా ఇటువంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ డ్రింకు కోసం ఉలవలను ఉపయోగిస్తున్నాం. పొయ్యిమీద పాన్ పెట్టి ఒక కప్పు ఉలవలను వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి. వేగిన ఉలవలను మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి పది రోజులు పాటు నిల్వ ఉంటుంది.
jaggery Health benefits in telugu
ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల ఉలవల పిండిని వేసి బాగా కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత మూడు స్పూన్ల బెల్లం పొడి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక పావు స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. పొయ్యి మీద నుంచి దించి ఈ మిశ్రమంలో అర గ్లాసు వేడి పాలు పోసి కలపాలి.

అంతే ఎంతో బలమైన ఆరోగ్యకరమైన ఉలవలతో తయారు చేసిన డ్రింక్ రెడీ.. .ఈ డ్రింక్ ని వర్షాకాలంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ముఖ్యంగా సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా కాపాడుతుంది. అంతే కాకుండా అధిక బరువు సమస్యతో ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
బరువు తగ్గాలి అనే ఆలోచనలో ఉండేవారు ఈ డ్రింక్ తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. .కాలేయంనకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో మంట, నొప్పి వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడటానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.