Beauty Tips

ఈ పొడితో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా పెరుగుతుంది

Hair Fall Paste In telugu : జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
Ginger benefits in telugu
మీడియం సైజ్ లో ఉన్న అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ గా చేసి దాని నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లో అల్లం రసం,మూడు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల మందార పువ్వుల పొడి వేసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి.
weight loss tips in telugu
ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
Hair fall Tips in telugu
మందార పువ్వులను ఎండబెట్టి పొడిగా చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్ లో దొరికే మందార పువ్వుల పొడిని వాడవచ్చు. విటమిన్-సి సమృద్దిగా ఉండుట వలన జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. మందారలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా చుండ్రును తగ్గిస్తుంది. తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.
hair fall tips in telugu
అల్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. హెయిర్ రూట్, ఫోలికల్స్‌ను దృఢంగా మారుస్తుంది. అల్లంలో ఉండే అనేక ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు వెంట్రుకలను బలంగా మారుస్తూ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి. పెరుగులో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా వేగంగా పెరగటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.