Healthhealth tips in telugu

అరటిపండు తింటే బరువు పెరుగుతారా…తగ్గుతారా…అసలు నమ్మలేరు

Banana health benefits In telugu :అరటిపండు అంటే చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంతింటూ ఉంటారు. అరటి పండు తింటే లావు అవుతారని చాలా మంది అరటిపండు తినటానికి ఇష్టపడరు. అయితే అరటిపండు తినటం వలన లావు అవ్వటం అనేది ఒక అపోహ మాత్రమే. అరటిపండులో మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉండేలా చేయటమే కాకుండా మంచి బ్యాక్టీరియా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు అరటిపండుతో సలాడ్ తయారుచేసుకుందాం.
banana benefits in telugu
సలాడ్ తయారీ
ఒక కప్పు అరటి పండు ముక్కలలో పావు స్పూన్ కారం,పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ సలాడ్ ని డైటింగ్ లో ఉన్నవారు తీసుకుంటే బాగుంటుంది. ఈ సలాడ్ ని సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి పని చేసి సాయంత్రం అయ్యేసరికి అలసి పోతూ ఉంటాం. ఆ సమయంలో ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఆ సమయంలో ఈ బనాన్ సలాడ్ తీసుకుంటే బాగుంటుంది.
Banana benefits in telugu
ఈ బనానా సలాడ్ ని బరువు తక్కువ ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, బిపి ఉన్నవారు తీసుకోవచ్చు. అయితే బిపి ఉన్నవాళ్లు సోడియం తక్కువ ఉన్న ఉప్పును వాడితే మంచిది. అరటి పండు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, మనకి అరటిపండ్లు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఒక అరటిపండు తింటే చాలా ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్,పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రోజంతా ఎనర్జీని ఇచ్చి ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఒక నెల రోజుల పాటు రోజుకొక అరటి పండు తింటే మలబద్దకం సమస్య తొలగిపోతుంది. అరటిపండులో ఉండే ఫైబర్ మలబద్దక సమస్యను తొలగిస్తుంది. ఎసిడిటి సమస్యలు,గుండెకు సంబందించిన సమస్యలు కూడా తగ్గుతాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన రక్తపోటును నియంత్రిస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. అరటిపండులా విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది.ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటిని ఎక్కువగా తగ్గిస్తుంది.మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.