Healthhealth tips in telugu

ఈ నాలుగు వ్యాధులు ఉన్నవారు జామపండు అసలు తినకూడదు…తింటే…?

Guava Fruit benefits in Telugu :జామ పండు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. జామ పండు అనేది సంవత్సరం పొడవునా లభ్యమవుతుంది. అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటుంది. జామ పండును అందరూ రెగ్యులర్ గా తింటూ ఉంటారు. కానీ జామ పండులో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలీదు.
Acidity home remedies
జామపండును పేదవాని ఆపిల్ అని కూడా అంటారు. జామపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగి జీర్ణ సంబంధ సమస్యలు గ్యాస్,అజీర్ణం,కడుపు ఉబ్బరం అలాగే మలబద్దకం లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
Diabetes In Telugu
అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు జామ పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు మితంగా తీసుకోవాలి. ఎందుకంటే జామ పండులో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఎసిడిటీ,ఉబ్బసం,కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కూడా జామ పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. .
jamakaya
జామపండులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యలు ఉన్న వారు రోజుకి ఒక జామపండు తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకుంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జామ పండును మితంగా తీసుకొని దానిలో ఉన్న ప్రయోజనాలను పొందండి. జామ పండు సంవత్సరం మొత్తం విరివిగా లభ్యం అవుతుంది.
jamakaya
కాబట్టి తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉన్న జామపండును మిస్ కాకుండా తినండి. అయితే బాగా పండిన జామ పండు తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.