కొబ్బరి+బెల్లం కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

coconut with jaggery benefits : కొబ్బరి,బెల్లం రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజు చిన్న కొబ్బరి ముక్కతో చిన్న బెల్లం ముక్కను కలిపి తినవచ్చు. లేదంటే కొబ్బరిని కోరి బెల్లం కలిపి పొయ్యి మీద పెట్టి పాకం పట్టి ఉండలుగా చేసుకొని రోజుకి ఒకటి చొప్పున తినవచ్చు.

కొబ్బరి,బెల్లం రెండింటిలోను మెగ్నీషియం, ఇనుము,కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. బెల్లంతో పోలిస్తే కొబ్బరిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి శ్వాస కోశ సమస్యలు అన్ని తగ్గుతాయి. జీర్ణ ఎంజైమ్స్ సక్రమంగా విడుదల అయ్యేలా చేస్తుంది.
Jaggery Health Benefits in Telugu
దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. కొబ్బరి, బెల్లం రెండింటిలోను పొటాషియం సమృద్దిగా ఉండుట వలన శరీరంలో అదనంగా ఉన్న నీటిని బయటకు పంపుతుంది. దాంతో అధిక బరువు నియంత్రణలో ఉంటుంది.

మైగ్రైన్ తలనొప్పి ఉన్నవారి బాధ వర్ణనాతీతం. భరించలేని నొప్పి ఉంటుంది. కొబ్బరి,బెల్లం కలిపి తింటే మైగ్రైన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కార్భోహైడ్రేట్లు సమృద్దిగా ఉండుట వలన త్వరగా జీర్ణం అవుతుంది. కాస్త అలసట,నీరసం ఉన్నప్పుడు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Joint pains in telugu
ముఖ్యంగా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒకప్పుడు కీళ్ల నొప్పులు అనేవి 60 ఏళ్ళు వచ్చాక వచ్చేవి. కానీ ఇప్పటి రోజుల్లో 40 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి. కాబట్టి 40 ఏళ్ళు వచ్చేసరికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.