ఈ రొట్టె తింటే మూత్రంలో మంట, మలబద్దకం, అజీర్ణం లాంటి ఎన్నో వ్యాధులు నయం అవుతాయి
Munaga aaku Rotti : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రావటం అయితే చాలా సులభంగా వచ్చేస్తున్నాయి. అయితే వాటిని తగ్గించుకోవటానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ రోజు మునగ ఆకుతో రొట్టె తయారీ చూద్దాం.

ఈ రొట్టెను వారంలో రెండు సార్లు తింటే మూత్రంలో మంట, మలబద్దకం, అజీర్ణం,ఆకలి లేకపోవటం వంటి ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. మునగ ఆకులో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకును రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది. ఒక బౌల్ లో రెండు కప్పుల పొడి బియ్యంపిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు శుభ్రంగా కడిగిన మునగ ఆకును వేయాలి.

ఆ తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. రెండు పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్కను మెత్తని పేస్ట్ గా చేసి వేయాలి. ఆ తర్వాత అరకప్పు పెరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత సరిపడా నీటిని పోసి పిండిని ముద్దగా అయ్యేలా కలపాలి.

ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి అరటి ఆకు మీద నూనె రాసి పిండి ముద్దను పెట్టి రొట్టెగా వత్తాలి. రొట్టెను ఎంత పలుచగా వీలు అయితే అంత పలుచగా వత్తాలి. ఈ రొట్టెను పెనం మీద కాస్త నూనె వేసి కాల్చాలి. ఈ రొట్టె చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మునగ ఆకుతో రొట్టెలు తయారుచేసుకొని తింటే ఎటువంటి సమస్యలు లేకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. మునగ ఆకు మనకు సులభంగానే లభ్యం అవుతుంది.

ఈ రొట్టెను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినవచ్చు…లేదంటే సాయంత్రం సమయంలో తినవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
మునగాకులో ఐరన్, కాల్షియం, బీటా కెరోటీన్, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచిది. మునగాకులో అధికంగా ఉన్న పీచు పదార్థం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

