వారంలో 2 సార్లు ఈ కూరను తింటే చెడు కొలెస్ట్రాల్,రక్తపోటు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Ladyfinger benefits In telugu : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాలుగా సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారిలో ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. .
బెండకాయ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. బెండకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవటమే కాకుండా రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో కూడా ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.బెండకాయలో ఉండే ఫైబర్ పేగు ద్వారా కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. బెండకాయ తీసుకుంటే దానిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయదు. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
బెండకాయలో యూజీనాల్ అనే ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను మందగించడంలో సహాయపడుతుంది. దాంతో రక్తప్రవాహంలో చక్కెర శోషణ తగ్గుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వారంలో రెండు సార్లు బెండకాయను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. బెండకాయలో ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ K సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య ఉండదు.
విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. మనలో చాలా మంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ వీటిలో ఉన్న ప్రయోజనాల కారణంగా తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.