Healthhealth tips in telugu

పైసా ఖర్చు లేకుండా ఈ ఆకుతో ఇలా చేస్తే పంటి నొప్పి,చిగుళ్ళ వాపు మాయం…జీవితంలో మళ్ళీ రాదు

Tooth Pain: పంటి నొప్పి వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. ఆ బాధ భరించటం కూడా సులభం కాదు. మనం తినే ఆహారం దంతాలలో పేరుకుపోయినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పంటి నొప్పికి కారణం అవుతుంది. పంటి నొప్పి ఉన్నప్పుడూ ఏ పని చేయాలన్న ఆసక్తి కూడా ఉండదు. పంటి నొప్పిని తగ్గించటానికి ఇంటి చిట్కా బాగా పనిచేస్తుంది.

జామ ఆకులు పంటి నొప్పిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జామ ఆకులు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. జామ ఆకులు పంటి నొప్పికి చెక్ పెడతాయి. ఒక గ్లాస్ నీటిని గినెల్లో పోసి పొయ్యి మీద పెట్టి దానిలో జామ ఆకులను మూడు తీసుకొని శుభ్రంగా కడిగి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి.
jama akulu
ఈ విధంగా రోజుకి నాలుగు సార్లు చేస్తే తొందరగా పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మరొక పద్దతి ఏమిటంటే తాజా జామ ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకొని నమలాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ రసం చేరేట్లు చూసుకోవాలి. ప్రభావితమైన దంతాలపై ఈ రసం చాలా బాగా పనిచేస్తుంది.
jama aaku
దంతాలలో ఉన్న బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, వైరస్ కారక క్రిములను నశింపజేస్తుంది. దంతాల నొప్పిని తగ్గిస్తుంది. ఈ ఆకుల్లో ఉన్న ఫ్లెవనాయిడ్స్ (యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ) మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు పంటినొప్పిని నివారించడంలో ఫర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పంటి నొప్పి. చిగుళ్ళ వాపు ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం ఉంటుంది. జామఆకులు కూడా చాలా సులభంగానే లభ్యం అవుతాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.