Healthhealth tips in telugu

పరగడుపున టీ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా…అసలు నమ్మలేరు

Tea Side Effects in telugu : మనలో చాలా మంది పరగడుపున టీ తాగుతూ ఉంటారు. ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంది. ఉదయం సమయంలో టీ తాగకపోతే ఏ పని చేయాలని అనిపించదు. అలాగే కొంతమందికి ఉదయం టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఇలా ఉదయం పరగడుపున టీ తాగితే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
Drinking tea in paper cups
టీ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల యాసిడ్ బేస్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది అసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలకు కారణం అవుతుంది. టీలో థియోఫిలిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది నిర్జలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది.
gas troble home remedies
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే మరో దుష్ప్రభావం ఏమిటంటే కడుపు ఉబ్బరం లేదా పొట్టలో పుండ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహారం తీసుకోవటానికి ముందు వేడి ద్రవాలను తాగినప్పుడు పొట్టను విస్తరిస్తుంది. ఈ ప్రక్రియ జీర్ణవ్యవస్థలో ఒత్తిడిని పెంచి కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.

టీ లో ఉండే కెఫిన్ కొంతమందిలో హృదయ స్పందన రేటును పెంచుతుంది. హృదయ స్పందన రేటు పెరిగితే ఒత్తిడి మరియు ఆందోళనకు దారి తీస్తుంది. కొంతమందిలో తల తిరుగుతుంది. ఉదయం టీ తాగిన తర్వాత నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది, ఇది నోటిలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది మరియు ఎనామిల్ దెబ్బతింటుంది.
Ginger Tea Side Effects
టీ ఉదయం పరగడుపున తాగకూడదు. భోజనం చేసిన గంట తర్వాత టీ తాగవచ్చు…లేదంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగవచ్చు…లేదంటే సాయంత్రం పూట స్నాక్స్‌తో టీ తీసుకోవచ్చు. కాబట్టి పరగడుపున టీ తాగకుండా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఖాళీ కడుపుతో సాధ్యమైనంత వరకు టీ తాగకుండా ఉండండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.