Healthhealth tips in telugu

రోజుకి 1 లడ్డు తింటే డయాబెటిస్, అధిక బరువు అనేవి ఉండవు….డయాబెటిస్ ఉన్నవారికి బెస్ట్ స్వీట్

Best sweet for diabetic patients : ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటిస్, అధిక బరువు అనే సమస్యలు చాలా ఎక్కువగా వేధిస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోతున్నారు. డయాబెటిస్ అనేది ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
Diabetes diet in telugu
అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. ఇప్పుడు చెప్పే లడ్డు ప్రతిరోజు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.
oats benefits
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు ఓట్స్ వేసి మంచి వాసన వచ్చేవరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు పుచ్చ గింజలు, ఒక స్పూన్ మెంతులు, రెండు స్పూన్ల నువ్వులు, 15 బాదం పప్పులు, ఒక స్పూన్ అవిసె గింజలు వేసి బాగా వేగించాలి. ఆ తరువాత అర కప్పు వేరుశనగలను వేసి వేగించాలి. .

వేగిన వీటిని (ఒట్స్ వేయకూడదు) మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లో తీసుకొని దానిలో వేగించిన ఓట్స్, ఒక కప్పు బెల్లం పొడి, ఐదు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. ఈ లడ్డుని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది.

ఈ లడ్డు రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఈ లడ్డు తినడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా అధిక బరువు., శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కాకుండా రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఈ లడ్డును డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.