Healthhealth tips in telugu

వారంలో 3 సార్లు తీసుకుంటే కీళ్లనొప్పులు,నడుము నొప్పి,అలసట,బలహీనత వంటి సమస్యలు ఉండవు

Calcium Rich Foods : వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా calcium లోపం ఎక్కువ అయ్యి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ పాలను తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. .

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు calcium లోపం, విటమిన్స్ లోపం వంటి వాటితో బాధపడుతున్నారు. ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు నీరసం, అలసట, ఆయాసం, శారీరక బలహీనత, నొప్పులు, జుట్టు రాలటం వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.
sompu beenfits
ఈ సమస్యలు ఉన్నప్పుడు మనం ఇప్పుడు తయారు చేసుకునే పాలను తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి కాస్త వేడెక్కాక ఒక స్పూన్ గసగసాలు వేసి వేగించాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలు పోయాలి.
Dry coconut Benefits in telugu
ఆ తర్వాత అర స్పూన్ సోంపు, రుచికి సరిపడా పటిక బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత అర స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించి ఆ పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా వారంలో మూడుసార్లు ఈ పాలను తాగితే శరీరంలో calcium లోపం, మెగ్నీషియం లోపం, పొటాషియం లోపం వంటివి ఏమీ లేకుండా అలసట, నీరసం, నిస్సత్తువ…అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి కూడా తగ్గుతాయి.
Patika Bellam Cold And Cough
గసగసాలలో ఉండే లక్షణాలు calcium లోపం లేకుండా చేస్తాయి. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. సోంపులో calcium, విటమిన్ లు,ఐరన్, మెగ్నీషియం వంటివి ఉండటం వలన నొప్పుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ పాలను తాగి ఈ సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.