1 గ్లాసు తాగితే నీరసం,అలసట,నిస్సత్తువ ఉండవు… తక్షణ శక్తిని ఇచ్చే సూపర్ డ్రింక్

anjeer And raisins Drink : నీరసం, అలసట,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా ఉండాలంటే ఉదయం సమయంలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. కొంతమందికి విపరీతమైన నీరసం వస్తుంది. అలాంటి సమయంలో ఏ పని చేయలేక మంచం మీద అలా పడుకొని పోతారు. .
Anjeer benefits
తమ పనులు చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఒక బౌల్ తీసుకొని ఐదు అంజీర్ , 10 ఎండు ద్రాక్ష వేసి ఒక కప్పు నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి ఉదయం మిక్సీ జార్లో నానబెట్టుకున్న అంజీర్, ఎండుద్రాక్షను నీటితో సహా వేసి మిక్సీ చేసుకోవాలి.

ఆ తర్వాత పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు కాస్త వేడి అయ్యాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అంజీర్ , ఎండుద్రాక్ష మిశ్రమం వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం తురుము, పావు స్పూన్ యాలకులపొడి వేసి మరో రెండు నిమిషాలు మరిగిస్తే తక్షణ శక్తిని అందించే సూపర్ డ్రింక్ రెడీ.
Fig Fruit Benefits in telugu
ప్రతిరోజు ఉదయం తాగితే అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. మన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది, అలాగే అధిక బరువు ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగితే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గుతారు. అలాగే అంజీర్, ఎండు ద్రాక్షలోనూ ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చూశారుగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ డ్రింక్ ని వారం రోజులు తీసుకోండి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల వారం రోజులు తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని అంది ఆరోగ్యంగా ఉంటాం. అలసట,నీరసం అనేవి అసలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.