ఈ ఆకు వాడితే నరనరాల్లో బలం పెరిగి డయాబెటిస్, పక్షవాతం వంటివి అసలు ఉండవు
Arugula leaves benefits : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే వేసుకొనే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి అరుగులా ఆకు (arugula leaves) చాలా బాగా సహాయపడుతుంది.
ఆవాలు కుటుంబానికి చెందిన ఈ ఆకు మంచి సువాసనతో ఉంటుంది. అరుగులా ఆకుల్లో విటమిన్లు ఏ,కె, బీ9, సి, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, కాల్షియం మరియు పొటాషియం ఉంటుంది. విటమిన్ K గ్లూకోజ్ జీవక్రియ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, కూడా సమృద్దిగా ఉండుట వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఇది ఇన్సులిన్ సెన్సిటివిటిని తగ్గిస్తుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండుట వలన సాదరణంగా డయాబెటిస్ రోగులలో ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే కణాలలోకి గ్లూకోజ్ రవాణాను మెరుగుపరుస్తుంది. మంచి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు డయాబెటిస్ కారణంగా వచ్చే న్యూరోపతిక్ సమస్యలను నివారిస్తుంది.
ఈ ఆకులను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ గా తయారుచేసుకొని తాగవచ్చు. అంతేకాకుండా ఈ ఆకులను సలాడ్ వంటి వాటిలో వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులను తీసుకొనే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడూ తీసుకొనే మోతాదు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.
ఈ ఆకును పుదీనా వాడినట్టు వాడితే సరిపోతుంది. ఈ ఆకు మెదడులోను,గుండెలోను రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏమి లేకుండా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు,మెదడుకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీని విత్తనాలు మార్కెట్ లో దొరుకుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.