Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు ఈ రసం తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఈ సీజన్ లో…

How To Make Horse Gram Soup : ఉలవలను ఒక్కప్పుడు పెద్దగా వాడేవారు కాదు. కానీ ఈ మధ్య కాలంలో ఉలవల్లో ఉన్న ప్రయోజనాల కారణంగా వాడటం అలవాటు చేసుకున్నారు. వారంలో రెండు సార్లు ఉలవలతో రసం చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఆహారంలో ఈ రసం ఉండేలా చూసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే ఉలవల్లో ఐరన్, కాల్షియం,ఫైబర్,ప్రోటీన్ వంటివి సమృద్దిగా ఉంటాయి. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ ఉలవల రసం బాగా పనిచేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Diabetes diet in telugu
ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఉలవల్లో పాలీఫినాల్స్, ఫ్లావోనాయిడ్లు కాలేయం, పిత్తాశయానికి రక్షణగా ఉంటాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఉలవల రసం ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు ఉలవలను శుభ్రంగా కడిగి నీటిని పోసి 5 గంటలు నానబెట్టాలి.
Horse Gram benefits
నానిన ఉలవలను ఉడికించాలి. మిక్సీ జార్ లో ఉడికించిన ఉలవలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, రెండు స్పూన్ల కొబ్బరి పొడి,4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ వేసి వేగాక రెండు గ్లాసుల నీటిని పోసి…ఆ తర్వాత ఉలవల పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత కొంచెం చింతపండు రసం,సరిపడా ఉప్పు వేసి 6 నుంచి 8 నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర కలపాలి. అంతే ఉలవల రసం రెడీ. ఈ రసంను వారంలో రెండు సార్లు తీసుకుంటే ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాస్త ఓపికగా ఇటువంటి రసంను చేసుకొని తింటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.