Beauty Tips

Face Glow Tips:శనగలతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది…ఇది నిజం

chickpeas glowing skin at home : మనలో చాలామంది ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా చర్మం కాంతి వంతంగా మెరవాలని ఖరీదైన ఫేస్ క్రీమ్స్,సీరం, ఫేస్ మాస్క్ వంటి ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అంతే. కాకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంటిలోనే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని తెల్లగా మెరిసేలాగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల శనగలు, ఒక స్పూన్ బియ్యం వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం శనగలు బియ్యాన్ని నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని పల్చని క్లాత్ సాయంతో వడగట్టి జ్యూస్ సెపరేట్ చేయాలి. ఈ జ్యూస్ ని ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఉడికిన ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్. ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ లోని ఆయిల్ వేసుకొని బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తూ ఉంటే ముడతలు, నల్లని మచ్చలు, ఫిగ్మెంటేషన్, మొటిమలు వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

శనగల్లో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన చర్మం మీద ముడతలను,మచ్చలను తొలగిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వు ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచుతుంది, ముడతలను తొలగిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.