Mullangi Vepudu:ముల్లంగి వేపుడు ఇలా చేస్కోండి.. టేస్టీగా ఉంటుంది
Mullangi Vepudu:ముల్లంగి వేపుడు..ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగి సాంబార్ లో తప్ప పెద్దగా వాడరు.ముల్లంగి తో వేపుడు కూడ చాలా ఈజీ.పైగా టేస్టీగా కూడ ఉంటుంది. ముల్లంగి వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
ముల్లంగి – 3
పచ్చమిర్చి – 5
ఉల్లిపాయ – 1
కరివేపాకు – ½ కప్పు
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా ముల్లంగిని తొక్క తీసేసి తురముకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అయిల్ వేడి చేసి జీలకర్ర ,ఆవాలు వేసి వేపుకోవాలి.
3.తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేగాక పచ్చిమిర్చి , పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
4.అల్లంవెల్లుల్లి వేగాక ముల్లంగి తురుమువేసి మూత పెట్టుకోని పది,పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ పై ఉడికించాలి.
5.రుచికి సరిపడా ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ముల్లంగి వేపుడు రెడీ.