Beauty Tips

పెసలతో ఇలా చేస్తే జుట్టు నుండి ఒక్క వెంట్రుక రాలదు..రాలిన జుట్టు దగ్గర 2 రెట్లు జుట్టు వస్తుంది

Pesalu hair Growth Tips in telugu : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చాలా నిరాశ పడతారు. జుట్టు రాలే సమస్యకు అనేక రకాల కారణాలు ఉంటాయి.
green gram benefits in telugu
జుట్టుకు అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ సరైన మోతాదులో అందకపోతే జుట్టు రాలే సమస్య వస్తుంది. అలాగే కొంతమందిలో మానసిక ఒత్తిడి కారణంగా కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, తలలో దురద వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఇప్పుడు ఒక చిట్కా తెలుసుకుందాం.
Hibiscus leaf
రాత్రి సమయంలో మూడు స్పూన్ల పెసలను ఒక బౌల్ లో వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పెసలలో నీటిని తీసేసి ఒక పల్చని క్లాత్ లో పెసలను వేసి మూట కట్టాలి. ఈ విధంగా .మూట కట్టడం వలన మరుసటి రోజు ఉదయం మొలకలు రావడం ప్రారంభం అవుతాయి. సాయంత్రం అయ్యేసరికి మొలకలు పూర్తిగా వచ్చేస్తాయి.
amudam
ఈ మొలకలను మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత 5 మందార ఆకులను వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్టులో ఒక స్పూన్ ఆముదం కలిపి జుట్టు .కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. పెసలలో ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు రాలే సమస్య నుంచి అద్భుతంగా బయటపడేస్తుంది.
hair fall tips in telugu
మందార ఆకులలో .బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా, పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. జుట్టు చివర్లు .చిట్లటం తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు మూడు వారాలపాటు చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.