అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా.. కమ్మటి ‘కట్టె పొంగలి’ ఇలా చేయండి!
Pongal Recipe:పొంగల్ రెసిపీ.. పూజలకు పండలకు నైవేథ్యాలకు, స్పెషల్ ప్రసాదం పొంగల్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
గుడిలో ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలి రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదే కమ్మటి రుచితో, అచ్చం గుడి స్టైల్లో కట్టె పొంగలిని (Katte Pongali) ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ ప్రసాదం పర్ఫెక్ట్గా, నోట్లో వేస్తే కరిగిపోయేలా వస్తుంది. ఆ నోరూరించే కట్టె పొంగలి రెసిపీని ఈ ఆర్టికల్‌లో వివరంగా చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
పచ్చి శనగలు – 1/2కప్పు
ఎండుమిర్చి -2
జీలకర్ర – 1 టీ స్పూన్
మిరియాలు – 1 టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
జీడిపప్పులు – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా బియ్యం , పచ్చిశనగలను శుభ్రంగా కడిగినాన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లోకి, మరిగించిన నెయ్యి వేసి, వేడి చేసుకుని, జీలకర్ర, ఎండుమిర్చి, తరిగిన అల్లం, కరివేపాకు వేసి వేపుకోవాలి.
3.అందులోకి మిరియాల పొడి, జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
4.జీడిపప్పులు వేగిన తర్వాత, ముందుగా నానపెట్టుకున్న, బియ్యం , శనగలను వేసి, ఒక కప్పు బియ్యం కోసం మూడు కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని, కుక్కర్ మూత పెట్టి, మూడు విజిల్సి వచ్చే వరకు ఉడికించాలి.
5. ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి, మిక్స్ చేసుకుని పొంగల్‌ను సెర్వ్ చేసుకోవడమే.

