Healthhealth tips in telugu

ఆస్తమా సమస్య ఉన్నవారు బెల్లం తింటే ఏమి అవుతుందో తెలుసా?

Asthma Home remedies in telugu : ఆస్తమా ఒక్కసారి వచ్చిందంటే తగ్గటం చాలా కష్టం. చలికాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో ఊపిరి సరిగా ఆడక చాలా ఇబ్బంది పడిపోతు ఉంటారు. ఆస్తమా రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికి దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కామన్ గా ఉండే లక్షణాలు.
asthama
ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మందులు వేసుకుంటున్నా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రాణాంతకం కాక పోయినా,తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ వ్యాధి పూర్తిగా తగ్గదు. ఉపశమనం కోసం మాత్రమే మందులు ఉంటాయి.
Jaggery Health Benefits in Telugu
ఆస్తమా నియంత్రణలో ఉంచటానికి ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ఆస్తమా కోసం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ఈ సీజన్ లో ప్రశాంతంగా ఉండవచ్చు. బెల్లంను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఆస్తమా నుంచి తగిన ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
lungs
బెల్లంలో ఉండే ఐరన్ రక్త ప్రసరణను పెంచి ఎర్ర రక్త కణాలను ప్రేరేపించి శ్వాసకోశ సమస్యలు లేకుండా చేస్తుంది. ప్రతి రోజు చిన్న బెల్లం ముక్కను తింటే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ని తగ్గించి దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గిస్తుంది. బెల్లంలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తుల భాగంలోని కండరాలకు బలాన్ని అందించి ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది.
jaggery Health benefits in telugu
శ్వాస సమస్యలను తగ్గించటానికి చాలా బాగా బెల్లం సహాయపడుతుంది. అయితే బెల్లంను సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ బెల్లంను వాడటానికి ప్రయత్నం చేయాలి. ఆర్గానిక్ బెల్లం ముదురు రంగులో ఉంటుంది. కెమికల్స్ కలిపిన బెల్లం పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి ముదురు రంగులో ఉండే ఆర్గానిక్ బెల్లంను వాడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.