వారంలో 2 సార్లు ఈ సూప్ తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఈ సీజన్ లో

Erra kandi pappu soup : ఈ కాలంలో ఉదయం సమయంలో సూప్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సీజన్లో శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు దగ్గు, జలుబు, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి.
masoor dal
రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అందువల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం కోసం ఉదయం సమయంలో సూప్ తాగితే చాలా మంచి ప్రయోజనాలు కనబడతాయి. దీని కోసం ఒక బౌల్ లో చిన్న కప్పు ఎర్ర కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి ఐదు గంటల పాటు నాన్న పెట్టాలి.

ఆ తర్వాత క్యారెట్, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానబెట్టిన కందిపప్పులో క్యారెట్, టమాటా ముక్కలు, పావు స్పూన్ పసుపు రెండు గ్లాసుల వాటర్ పోసుకుని పాన్ లో పెట్టి ఉడికించాలి. ఉడికించుకున్న పదార్థాలను నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి వేసి పది. నిమిషాల పాటు మరిగిస్తే వేడి వేడిగా ఎర్ర కందిపప్పు సూప్ రెడీ అవుతుంది. వారంలో రెండు లేదా మూడుసార్లు ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి.

అలాగే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. కాస్త ఓపికగా ఈ సూప్ చేసుకొని తాగితే మంచిది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.