Healthhealth tips in telugu

నల్ల గోధుమలను ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Black Wheat Benefits in Telugu : మనలో చాలా మందికి ఈ మధ్య కాలంలో ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో నల్ల గోధుమలను వాడటం ఎక్కువ అయింది. మామూలు గోధుమ‌ల కంటే న‌ల్ల గోధుమ‌ల ధ‌ర నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే పోష‌క విలువ‌లు కూడా న‌ల్ల గోధుమ‌ల్లో అధికంగానే ఉంటాయి.
Black wheat
మామూలు గోధుమలతో పోలిస్తే నల్ల గోధుమలలో గ్లూటెన్ ఉండదు. నల్ల గోధుమలలో యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం, ఫైబర్ మరియు అమినో యాసిడ్‌లు ఉంటాయి. నల్ల గోధుమ పిండితో పుల్కా, చపాతీ, పరాఠా, బ్రెడ్ వంటి వాటిని తయారుచేసుకొని తినవచ్చు.
gas troble home remedies
అలాగే నల్ల గోధుమలను ఏ రూపంలోనైనా తీసుకున్న వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి జీవక్రియ సమయంలో శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. అందువల్ల జీవక్రియకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.
Weight Loss tips in telugu
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల గోధుమలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేయటమే కాకుండా తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. నల్ల గోధుమలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
cholesterol
నల్ల గోధుమలు కాలేయం నుండి అదనపు కొవ్వును తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచటమే కాకుండా రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
cholesterol reduce foods
నల్ల గోధుమలలో ప్రొటీన్‌తోపాటు మెగ్నీషియం, ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ప్రతిరోజూ నల్ల గోధుమలను తీసుకుంటే, రక్తహీనత సమస్యను తగ్గించటమే కాకుండా శరీరంలో ఆక్సిజన్ స్థాయి సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తుంది. వారంలో రెండు సార్లు నల్ల గోధుమలను తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.