Healthhealth tips in telugu

15 రోజులు 1 స్పూన్ నీటితో కలిపి తాగితే కీళ్ల నొప్పులు,కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది

Home Remedies For Joint Pain In Telugu : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్నునొప్పి వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకల మధ్యలో జిగురు తగ్గిపోవటం, నడిచినప్పుడు టక్ టక్
అని శబ్ధం వస్తుంది. ఇలా నడిచినప్పుడు శబ్దం వచ్చిన వెంటనే మనం కీళ్ల నొప్పులకు సూచనగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.
sonthi podi health benefits in telugu
ఈ నొప్పులకు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే పొడి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఎముకల మధ్య జిగురు పెరిగి టక్ టక్ శబ్దం తగ్గుతుంది. ఈ రెమిడీ కోసం 50 గ్రాముల శొంఠి పొడి తీసుకోవాలి. శొంఠి పొడి శరీరంలో వాతం తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
fenugreek seeds
ఆ తర్వాత 50 గ్రాముల మెంతులు తీసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల వాము తీసుకోవాలి.శొంఠి పొడి మార్కెట్ లో దొరుకుతుంది. అలా కాకుండా శొంఠి కొమ్ములను తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాన్ లో కొంచెం నూనె వేసి వేగించి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ లో మెంతులు,వాము,శొంఠి పొడి వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.

ఈ పొడి దాదాపుగా నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి కలిపి తాగాలి. రుచి కోసం అవసరం అనుకుంటే ఒక స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం బెల్లం వేసుకోకూడదు. ఈ విధంగా ఒక 15 రోజులు పాటు తాగితే నొప్పులు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
Jaggery Health Benefits in Telugu
అలాగే శరీరంలో పేరుకుపోయిన మలినాలను కూడా బయటికి పంపిస్తుంది. బెల్లం కలిపి తాగడం వలన శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా అంది రక్తహీనత వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఉదయం తాగటం వలన రోజంతా ఎనర్జీగా ఉంటారు. రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.