Healthhealth tips in telugu

రోజుకి 25 గ్రాములు తింటే అధిక బరువు తగ్గటమే కాకుండా డయాబెటిస్,గుండె సమస్యలు ఉండవు

Roasted gram chana Benefits In telugu : వేగించిన శనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఒక సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఈ శనగల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు. .
vepina sanagalu benefits
అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అందువల్ల బరువు తగ్గాలనే ప్రణాళికతో ఉన్నవారికి ఈ శనగలను తీసుకోమని పోషకాహార నిపుణులు చెప్పుతు ఉంటారు. ప్రతిరోజు 25 గ్రాములు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మాంగనీస్ ,ఫోలెట్,ఫాస్ఫరస్, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. .
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్న వారిలో గ్లూకోజ్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఏమీ లేకుండా చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోజులో ఏ సమయంలో అయినా వీటిని తినొచ్చు.
gas troble home remedies
దీనిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ శనగలు అందరికీ అందుబాటు ధరలో ఉండటమే కాకుండా విరివిగా లభ్యం అవుతాయి. కాబట్టి వీటిని తిని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

శనగలను ప్రతి రోజు తీసుకున్నప్పుడు ఏమైనా సమస్యగా అనిపిస్తే వారంలో రెండు సార్లు తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు. చాలా తక్కువ ఖర్చులో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.