Healthhealth tips in telugu

పాలలో ఈ పొడి కలిపి తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు

Nidra lemi samasya in telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అధిక బరువు, గుండె జబ్బులు, మెదడు పనితీరు మందగించడం, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినటం ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.
sleeping problems in telugu
నిద్రలేమి సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు చెప్పే పొడిని వాడితే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ పొడి కోసం 15 బాదం పప్పులు, గుప్పెడు పల్లీలు, మూడు స్పూన్ల గుమ్మడి గింజలు,మూడు టేబుల్ స్పూన్ల సన్ ఫ్లవర్ సీడ్స్, రెండు స్పూన్ల సోయాబీన్స్, 15 వాల్ నట్స్ తీసుకోవాలి.
Diabetes patients eat almonds In Telugu
వీటిని విడివిడిగా పాన్ లో వేగించాలి. వేగించిన ఈ పదార్థాలు కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.
ఈ పొడిని ఫ్రిజ్ లో నిల్వ చేస్తే దాదాపుగా నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి, అర స్పూన్ బెల్లం తురుము వేసుకొని బాగా కలిపి ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ ముందు లేదా తర్వాత తీసుకోవాలి.
walnut benefits in telugu
డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే నిద్రలేమి సమస్య క్రమంగా తగ్గుతుంది. ఈ పొడి నిద్రలేమి సమస్యలు తగ్గించడమే కాకుండా రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎముకలు బలంగా తయారవుతాయి. మెదుడు చురుగ్గా పని చేసి వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.
gummadi ginjalu benefits in telugu
కాస్త ఓపికగా ఈ పొడిని తయారుచేసుకుంటే దాదాపుగా నెల రోజుల వరకు వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు. ఈ పొడిని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ వాడవచ్చు. కాబట్టి ఈ పొడి తయారు చేసుకొని తాగితే మంచి ప్రయోజనం పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.