Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలం తింటే ఏమి అవుతుందో తెలుసా?

custard apple Benefits In telugu :సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అందరికీ చాలా మంచిది. ఎవరైనా సరే ఏయే కాలంలో వచ్చే పండ్లని తీసుకోవడం మంచిది అని చెబుతుంటారు. చలికాలంలో ఎక్కువగా సీతాఫలాలు వస్తుంటాయి. ఈ పండ్లని షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చో లేదో తెలుసుకోండి..
Diabetes In Telugu
సాదరణంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకొనే ఆహారం కూడా డయాబెటిస్ ఉన్న వారిలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందుకే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. కొన్ని పండ్లను తీసుకోవచ్చు. అలాగే కొన్ని పండ్లను తీసుకోకూడదు.

అయితే సీతా ఫలం డయాబెటిస్ అంటే మధుమేహం ఉన్నవారు తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. సీతాఫలానికి డయాబెటిక్ పేషెంట్స్ కాస్తా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో చక్కెరశాతం అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం అనేది డయాబెటిస్ ఉన్నవారికి అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

ఈ పండుని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే, మరి నోరు కట్టేసుకోకుండా ఈ పండుని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్(జిఐ) 54 గా ఉంటుంది. అయితే, డయాబెటిక్ పేషెంట్స్ జిఐ 55, అంతకంటే తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవచ్చు.
Diabetes symptoms in telugu
ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. ఈ పండుని తినడం వల్ల ఆకలితో ఉన్నప్పుడు తింటే కడుపు నిండిన భావన ఉంటుంది.ఈ పండులో ఎక్కువగా హిమోగ్లోబిన్ స్థాయిలు ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. మెదడు కూడా చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.