MoviesTollywood news in telugu

బైరవ ద్వీపం సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు మీకోసమే

Bhairava Dweepam Full Movie :బాలకృష్ణ ,రోజా జంటగా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన జానపద మూవీ భైరవ ద్వీపం అప్పట్లో ఓ సంచలనం. అద్భుతమైన గ్రాఫిక్స్. ఎగిరే మంచం, రెక్కల గుర్రం, అల్లరి దెయ్యం, మాంత్రికుని గుహ, అమ్మవారి విగ్రహం, ఇలా అన్ని ఫిదా చేస్తాయి.

నిర్మాతలకు లాభాల పంట పండించిన ఈ మూవీ బాలయ్య, రోజాలకు మంచి బ్రేక్ ఇచ్చింది. విజయ సంస్థల అధినేతలలో ఒకరైన నాగిరెడ్డి కుమారులు వెంకట్రామిరెడ్డి సోదరులతో కల్సి చందమామా విజయ కంబైన్స్ పేరిట 1981లో సంస్థను నెలకొల్పి, రాజేంద్రప్రసాద్ తో సింగీతం డైరెక్షన్ లో బృందావనం తీసి హిట్ కొట్టారు.

తమ సంస్థతో అనుబంధం గల రావికొండలరావు కి నిర్మాణ బాధ్యతలు అప్పగించడంతో పాతాళ భైరవి మూవీలోని భైరవి తీసుకుని ద్వీపం జోడించి, భైరవ ద్వీపం టైటిల్ పెట్టారు. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యక్షిణి స్పెషల్ పాత్రలో రంభ సెలెక్ట్, బాలయ్య తల్లిదండ్రులుగా విజయకుమార్, కె ఆర్ విజయ, పెంపుడు తల్లిగా రాధాకుమారి, గురువుగా మిక్కిలినేని, రోజా తల్లిదండ్రులుగా సత్యనారాయణ,సంగీత,ఇలా తారాగణం పూర్తయింది.

మాంత్రికుడిగా అమ్రిష్ పురి, నానా పటేకర్ లను పరిశీలించగా, చివరకు రాజ్ కుమార్ ని తీసుకున్నారు. 1993 జూన్ 2న మద్రాసు వాహిని స్టూడియోలో భైరవ ద్వీపం మూవీకి రజనీకాంత్ క్లాప్ కొట్టగా, చిరంజీవి స్విచ్ఛాన్ చేసారు. ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వం వహించారు. నరుడా నరుడా సాంగ్ తీయడానికి నెలరోజులపాటు నిర్వహించారు.

అంబ శాంభవి సాంగ్ కోసం జలపాతంకి కష్టం మీద చేరుకొని పార్వతీ గుడి, ప్రతిమ సెట్టింగ్ వేశారు. అక్కడికి బాలయ్య, కె ఆర్ విజయలను కష్టం మీద చేరిస్తే, 80 ఏళ్ల వయస్సుగల మిక్కిలినేని ని నలుగురు అసిస్టెంట్స్ రోజూ అక్కడికి చేర్చేవారు. చుట్టూ కొండల కారణంగా మధ్యాహ్నం 12కి వెలుగు వచ్చేది.

అలా రోజుకి రెండు గంటల చొప్పున షూటింగ్ చేసారు. జలపాతం దగ్గరలోని అడవి దగ్గరకు 25 గుర్రాలు తెచ్చి షూటింగ్ చేసారు. అద్దాల రాక్షసుల సీన్స్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసారు. హార్బర్ క్రేన్ తెచ్చి 15 రోజుల పాటు మంచం ఎగరడం వంటి సీన్స్ తీశారు. మరుగుజ్జు కోసం నాలుగు లిల్లీపుట్ బొమ్మలు చేసి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తూ షూట్ చేసారు.

శ్రీ నారద తుంబుర సాంగ్ కోసం బాలయ్య ఎంతో సాధన చేసారు. 235 రోజులు శ్రమించి 4కోట్ల 35లక్షలతో ఈ సినిమా చేసారు. మ్యూజిక్ కి ఇళయరాజా, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అనుకున్న చివరికి మాధవపెద్ది సురేష్ ని ఉంచేశారు. 1994 ఏప్రియల్ 14న సురేష్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నిర్మాత స్వయంగా రిలీజ్ చేసారు.

తొలి రోజు హిట్ టాక్. 59 కేంద్రాల్లో 50రోజులు, చిన్న కేంద్రాలతో సహా 49 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. రావి కొండలరావు సంభాషణలు, సింగీతం దర్శకత్వ ప్రతిభ, కురూపితో సహా బాలయ్య నటన, కబీరలాల్ కెమెరా, పేకేటి రంగా ఆర్ట్ ఇలా అన్ని ఈ సినిమా విజయంలో కీలకమయ్యాయి.

నరుడా ఓ నరుడా సాంగ్ కి జానకికి, శ్రీ తుంబుర సాంగ్ కి బాలుకి నంది అవార్డులు వచ్చాయి. దర్శకుడుతో సహా మరో మూడు నంది అవార్డులు వచ్చాయి. తమిళంలో డబ్బింగ్ చేయగా ఆకట్టుకుంది. హిందీలో రిలీజ్ చేసారు. నరుడా సాంగ్ ని ఆశాం భోస్లే పాడలేకపోతే జానకి చేత పాడించారు.