మన పెరట్లో పెరిగే ఈ మొక్కను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ నిజాన్ని తెలుసుకోండి
Vaamu aku benefits in telugu :ఈ ఆకును వివిధ ప్రదేశాలలో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తుంటారు…రాయలసీమ లో కప్పరిల్లాకు అని, ఆంద్ర లో కర్పూరం చెట్టు అని, వాము ఆకు చెట్టు అని పిలుస్తారు. ఆకు వాసన విశిష్టమైనది, విశిష్ట గుణాలు కలది. వాము మొక్కను మన పెరట్లో సులభంగా పెంచవచ్చు. వాము మొక్క బలహీనమైన కాండంతో ఉంటుంది.

వాము ఆకు చాలా మందంగా ఉండి మంచి సువాసనను కలిగి ఉంటుంది. వాము ఆకును పచ్చిగా తినవచ్చు. వాము ఆకుతో బజ్జిలు,పచ్చడి వంటివి తయారుచేస్తారు. వాము ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ రోజుల్లో మారిన బిజీ జీవనశైలి కారణంగా ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవటం వలన జీర్ణ సమస్యలు అయినా అజీర్తి,గ్యాస్,కడుపు ఉబ్బరం సమస్యలు,మలబద్దకం వంటివి వస్తున్నాయి.

ఆ సమస్యలను తగ్గించటంలో వాము ఆకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కగా పనిచేస్తుంది.

చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన గాయాలు,మచ్చలను తగ్గిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే వాము ఆకు పసుపు వలె పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు మంచి మందు అని చెప్పవచ్చు.

ప్రతి రోజు భోజనం అయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుడుతుంది. చిన్న పిల్లలకు వాము ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే దగ్గు,జలుబు వంటివి రాకుండా నిరోధించవచ్చు.

తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది.
