Healthhealth tips in telugu

హై బీపీ ఉన్నవారు నల్ల నువ్వులను తింటే ఏమి అవుతుందో తెలుసా?

Black sesame seeds helps to control blood pressure level : అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు జీవిత కాలం మందులు వాడాలి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. రక్తపోటు సమస్య ఉన్నవారు నువ్వులను తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. నువ్వులలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అనే రెండు రకాలు ఉంటాయి.

నల్ల నువ్వులను రోజువారీ ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నల్ల నువ్వులలో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్, జింక్, ఐరన్ వంటి పోషకాలు మరియు అవసరమైన సూక్ష్మ ఖనిజాలు ఉంటాయి.ఇవి కణాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను పెంచడానికి మరియు శరీరం అంతటా ఆక్సిజన్ మెరుగైన ప్రసరణకు సహాయపడతాయి. నల్ల నువ్వులలో ఎక్కువగా మోనో అన్‌శాచురేటెడ్ మరియు పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంతృప్త కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని అసంతృప్త కొవ్వుతో భర్తీ చేయడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

నల్ల నువ్వులలో మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయ పడుతుంది. రక్తపోటును తగ్గించి స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, నల్ల నువ్వులలో సెసమిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది ఒక బహుళ అసంతృప్త కొవ్వు, ఇది అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

నల్ల నువ్వులను నూనె రూపంలో వంటలలో వాడవచ్చు…లేదంటే నల్ల నువ్వులలో బెల్లం కలిపి లడ్డూలు చేసుకొని తినవచ్చు…లేదంటే రోజు చేసుకొనే కూరల్లో వేసుకోవచ్చు…లేదంటే నల్ల నువ్వులను పేస్ట్ గా చేసి పాలల్లో ఉడికించి తీసుకోవచ్చు.రాత్రి సమయంలో నువ్వులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.