వజ్రాయుధం సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా…అసలు నమ్మలేరు
vajrayudham telugu movie :సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన వజ్రాయుధం మూవీ ని అప్పట్లో అగ్రగామి పంపిణి సంస్థ లక్ష్మి ఫిలిమ్స్ బ్యానర్ పై తీశారు. ఆరోజుల్లో లక్ష్మి ఫిలిమ్స్ అధినేత లింగమూర్తి విజయవాడ నుంచి మద్రాసు వస్తుంటే, ప్రొడ్యూసర్స్ ఎదురెళ్లి తీసుకొచ్చేవారు.
అలాంటి వ్యక్తి లక్ష్మి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై తొలి మూవీగా వజ్రాయుధం నిర్మించారు. విజయవాడ అప్సర థియేటర్ అధినేత డి కాశీ విశ్వనాధరావు ఈ ప్రాజెక్ట్ తలపెట్టారు. అగ్ని పర్వతం తీస్తున్న సమయంలోనే రాఘవేంద్రరావు ని సంప్రదించగా ఆయన ఒకే చెప్పారు. సినిమా స్టార్ట్ చేసేముందు అనుకోని అవాంతరం రావడంతో దర్శకేంద్రుని అభ్యర్ధన మేరకు లింగమూర్తి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు.
ఆవిధంగా 1984నవంబర్ 1న పద్మాలయా స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి భారీ ఏర్పాట్లు చేసారు. సరిగ్గా ముందు రోజు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురవ్వడంతో సినిమా షూటింగ్ వాయిదాపడింది. 4వ తేదీన నిరాడంబరంగా వజ్రాయుధం మొదలైంది. వజ్రాయుధం టైటిల్ పెట్టాక, అందుకు తగ్గట్టు పరుచూరి బ్రదర్స్ కథ రూపొందించారు. హీరో హీరోయిన్స్ ఒకరిపై ఒకరు క్లాప్ ఇచ్చుకున్నారు.
వేటూరి రాసిన ఆ బుగ్గ మీద గోరువిచ్చుదేందబ్బా సాంగ్ తో షూటింగ్ స్టార్ట్. ఈ సాంగ్ కోసం ఫిలిం నగర్ సమీపంలోని కొండపై 3లక్షలతో సెట్ వేశారు. వీణ, వయోలిన్, మృదంగం, వేణువు ఇలా అన్ని ఉపయోగించి ఈ సాంగ్ ని వెరైటీగా షూట్ చేసారు. దర్శకేంద్రుని సాంగ్స్ బాణీ మరెవ్వరూ అనుసరించలేరు.
హైదరాబద్ లో మేజర్ షూటింగ్ చేశారు. నెల్లూరు సోమశిల ప్రాజెక్ట్ దగ్గర , రాజమండ్రి లలో కొన్ని సీన్స్ తీశారు. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ అదిరిపోయేలా తీశారు. శ్రీదేవి, బేబీ సీత పాత్రలకు హీరో కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉందని ఫాన్స్ కామెంట్స్ చేసినా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయవాడ, నెల్లూరులలో హౌస్ ఫుల్స్ తో ఆడింది.