Healthhealth tips in telugu

ఈ పువ్వులలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం

Tangedu puvvu Benefits In telugu : మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటిల్లో ఉన్న ప్రయోజనాలు గురించి తెలియక అవి పిచ్చి మొక్కలుగా భావిస్తాము. వాటిల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. అలాంటి మొక్కలలో తంగేడు చెట్టు గురించి తెలుసుకుందాం.
tangedu puvvu
తంగేడు చెట్టులో పువ్వులు,ఆకులు,వేర్లు అన్నీ బాగాలు ఉపయోగపడతాయి. తంగేడు పువ్వులతో కాషాయం చేసుకొని ఉదయం పరగడుపున త్రాగితే డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్‌ను నుంచి తప్పించు కోవాలంటే.. 30 ఏళ్లు దాటిన వారు నెలలో ఓసారి లేదా రెండుసార్లు తంగేడు పువ్వుల కషాయాన్ని తప్పకుండా తీసుకోవాలి.
Diabetes In Telugu
తంగేడు ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. తంగేడు పూలలో సాపోనిన్స్ అనే సహజసిద్దమైన యాంటీమైక్రోబయల్ సమ్మేళనం ఉండుట వలన ఫంగస్ మరియు మైక్రోబయల్ ఇన్ ఫెక్షన్స్ మీద పోరాటం చేస్తుంది.
Urine Infection Home Remedies In Telugu
టైఫాయిడ్, కలరా మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ పువ్వులు దాని హైడ్రేటింగ్ లక్షణాల కారణంగా శీతలకరణిగా ఉపయోగిస్తారు. పూర్వ కాలంలో ఎండలో పనిచేసేటప్పుడు ఈ మొక్కలను తమ తలపై పెట్టుకునేవారు. ఈ మొక్క యొక్క శీతలీకరణ శక్తి చాలా గొప్పది.
hair fall tips in telugu
తంగేడు పువ్వులను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడకట్టి ఆ నూనెను రోజు జుట్టుకి రాస్తూ ఉంటే జుట్టు రాలె సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఎండిన తంగేడు పువ్వు పొడిలో నీటిని కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి. ఈ పువ్వులకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కూడా ఉంది. ఈ పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.