Healthhealth tips in telugu

అర స్పూన్ పొడి 100 % నొప్పులను మాయం చేస్తుంది…సర్వ రోగ నివారిణి

knee pain relief home remedy : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే సరిపోతుంది.
Joint pains Home Remedies In telugu
ఈ పొడి నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
cholesterol
ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది. చింత గింజల పొడితో పళ్లను తోమితే పంటి మీద గార, పసుపు రంగు తొలగి తెల్లగా మెరుస్తాయి. చింత గింజలు పాంక్రియాస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. చింత గింజల నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నాచురల్ గా మ్యానేజ్ చేయగలుగుతారు.

చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన స్కిన్ కి వచ్చే ఇన్‌ఫెక్షన్స్ ని తగ్గించుకోవచ్చు. అంతే కాక యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేయవచ్చు. చింత గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత గింజలు,పొడి రెండూ ఆయుర్వేదం షాప్స్ లేదా Online Stores లో లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.