Healthhealth tips in telugu

కాలీఫ్లవర్‌ ఆకులను పాడేస్తున్నారా…ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు…ఇది నిజం

cauliflower leaves Benefits In telugu : కాలీఫ్లవర్‌ ఆకులలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనలో చాలా మందికి ఆ విషయం తెలియక కాలీఫ్లవర్‌ తో కూర చేసినప్పుడు కాలీఫ్లవర్‌ ఆకులను పాడేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను తెలుసుకుంటే పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు.
cauliflower-improves-blood-circulation-in-winter
కాలీఫ్లవర్‌ ఆకుల్లో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే కాలీఫ్లవర్‌ ఆకులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా చాలా సమృద్దిగా ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా బాగా సహాయపడతాయి.
Immunity foods
అంతేకాకుండా శరీరం యొక్క జీర్ణ శక్తిని అభివృద్ధి చేయడంలో మరియు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. 100 గ్రాముల కాలీఫ్లవర్‌ ఆకుల్లో 600 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ అంటే అలర్జీ ఉన్నవారు క్యాలీఫ్లవర్ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని కాల్షియం బ్యాలెన్స్ అవుతుంది.
Joint Pains
కాలీఫ్లవర్ ఆకులను ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చ నిగనిగలాడే మరియు శుభ్రమైన ఆకులు అంటే మచ్చ లేని కాలీఫ్లవర్ ఆకులను ఎంచుకోవాలి. ఆకులపై తెల్లటి మచ్చలు లేదా పసుపు రంగు ఉండకూడదు. తాజా ఆకులను నీటిలో బాగా కడిగి వాడాలి.
కాలీఫ్లవర్ ఆకులకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది.
cauliflower stem
కాబట్టి దీన్ని చాలా వరకు ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించవచ్చు. దీన్ని పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఉడికిన తర్వాత కూడా అందులోని పోషకాలు ఏవీ పోవు. ఈ ఆకులను సూప్, సలాడ్ మొదలైన వాటిలో కలపవచ్చు. లేదంటే పాలకూర,మెంతి కూర బదులుగా కాలీఫ్లవర్ ఆకులను వాడవచ్చు. కాలీఫ్లవర్‌ ఆకులను ఏ రూపంలో తీసుకున్న వాటిలోని పోషకాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.