Healthhealth tips in telugu

1 గ్లాస్ ఇది తాగితే చాలు…రక్తనాళాల్లో అడ్డంకులు పోగొట్టి పక్షవాతం రాకుండా చేస్తుంది

Paralysis Home Remedies In telugu : మన శరీరంలో అన్ని అవయవాలు బాగా ఉండి అకస్మాత్తుగా వైకల్యాన్ని తెచ్చిపెట్టే సమస్య పక్షవాతం. దీనిని బ్రెయిన్ స్ట్రోక్ గా చెప్తారు. పక్షవాతం వచ్చాక అలాగే రాకముందు కూడా జాగ్రత్తలు చాలా అవసరం. ఎందుకంటే పక్షవాతం వచ్చింది అంటే కాలు చేయ ఆడకుండా మరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది.
minumulu
పక్షపాతం అనేది మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల లేదా రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ రోజు పక్షవాతం తగ్గటానికి ఒక రెమిడి తెలుసుకుందాం. ఇంగ్లీష్ మందులు వాడుతూ ఈ రెండిటిని ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ రెమిడీకి రెండు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం.
Ginger benefits in telugu
పొట్టు ఉన్న మినపప్పును ఉపయోగించాలి. మినప్పప్పు నాడీ వ్యవస్థను బలపరచి మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. నాడీ బలహీనత పాక్షిక పక్షవాతం మరియు ముఖ పక్షవాతం వంటి వాటిని నయం చేయటానికి మినపప్పును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అల్లంను కూడా ఆయుర్వేదంలో పక్షవాతం చికిత్సలో ఉపయోగిస్తున్నారు.
cholesterol reduce foods
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ మినపప్పు, అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఆ తర్వాత గ్లాస్ లోకి వడకట్టి ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి.

అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండాలి. అధిక బరువు కూడా ఉండకూడదు.కొలెస్ట్రాల్,రక్తపోటు,అధిక బరువు అనేవి పక్షవాతం రావటానికి కారణమా అవుతాయి. డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ మాత్రమే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. ఈ పరిస్థితి ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.