Healthhealth tips in telugu

2 నిమిషాల్లో పళ్ళపై గార మొత్తం మాయం అయ్యి పళ్ళు తెల్లగా మెరవాలంటే ?

White Teeth Tips In telugu : మనం ఎంత శుభ్రత పాటించినా దంతాలు రంగు మారడం సహజం. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పసుపుపచ్చగా మారతాయి. ఈ పసుపు పొరను తొలగించి, తిరిగి దంతాలను ముత్యాల్లా మెరిసిపోవాలంటే ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. చాలా మంది పళ్ళు పసుపుగా మారగానే డాక్టర్ దగ్గరకు పరిగెట్టి ఖరీదైన ట్రీట్ మెంట్స్ తీసుకుంటూ ఉంటారు.
White teeth tips
అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. మన ఇంటిలో సులువుగా దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో పళ్ళ మీద పసుపు గారను పోగొట్టు కోవచ్చు. అలాగే కావిటీస్,గార,పంటి నొప్పి,చిగుళ్ల నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక స్పూన్ మిరియాల పొడిలో అరస్పూన్ ఉప్పు కలిపి నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ తో పళ్లను ఉదయం, రాత్రి సమయంలో బ్రష్ సాయంతో రుద్దుకుంటే క్రమంగా పళ్ళు తెల్లగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో తెల్లని పళ్లను సొంతం చేసుకోవచ్చు.

మిరియాలలో ఉన్న లక్షణాలు కావిటీస్,గార,పంటి నొప్పి, వంటి పంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉప్పు చిగుళ్ల నొప్పిని తగ్గించటమే కాకుండా పళ్ళు తెల్లగా అవవటానికి సహాయపడుతుంది. మిరియాలు,ఉప్పు కలిపి పళ్ల మీద మాయ చేస్తాయి. తెల్లని మెరిసే పళ్ల కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

మనం కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పసుపు రంగు,గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తెల్లని పళ్లను సొంతం చేసుకోవచ్చు. మిరియాలు,ఉప్పు రెండూ కూడా మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి. పంటి నొప్పి సమస్యలు,చిగుల్లా సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.