Healthhealth tips in telugu

పాలకూర Vs మెంతికూర…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు

spinach Vs fenugreek leaves Benefits In telugu : పాలకూర మరియు మెంతికూరలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు ఆకుకూరలు ఈ సీజన్ లో చాలా విరివిగా లభిస్తాయి. ఈ ఆకుపచ్చని ఆకుకూరల్లో ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైబర్ పుష్కలంగా లభ్యం అవుతాయి. పాలకూర,మెంతి కూర రెండింటిలోను విబిన్నమైన ప్రయోజనాలు ఉన్నాయి.

పాలకూర విషయానికి వస్తే…రక్తహీనత సమస్య ఉన్నవారు పాలకూరను రెగ్యులర్ గా తీసుకుంటే పాలకూరలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అలాగే పాలకూరలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉంటాయి.
eye sight remedies
కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేయటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు మరియు వయస్సు పెరిగేకొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం మరియు క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. పాలకూరలో ఉండే మెగ్నీషియం రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Fenugreek leaves benefits
అలాగే మెంతికూర విషయానికి వస్తే…మెంతికూరలో విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉండి కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మెంతికూరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. అదనంగా రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. చలికాలంలో మెంతికూర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
spinach Benefits In Telugu
ఇక పాలకూర,మెంతికూర రెండిటిలో ఏది మంచిది అనే విషయానికి వస్తే….డయాబెటిస్ ఉన్నవారు, రక్తప్రవాహ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో మాత్రమే పాలకూరను తీసుకోవాలి. మెంతికూరలో పాలకూర కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అందువల్ల మెంతికూర ఎముక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
fenugreek leaves Benefits in telugu
తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలని అనుకుంటే పాలకూరకు బదులుగా మెంతికూర తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పాల కూర కంటే మెంతికూరలో తక్కువ కార్బ్ కంటెంట్ ఉంటుంది. కానీ ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మెంతికూరలో 2.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 4 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి, అయితే 100 గ్రాముల పాలకూరలో 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.