ఈ ఫోటోలో వెంకటేష్ తో పాటు ఉన్న యంగ్ హీరో ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో వెంకటేష్ తో పాటు అల్లరిగా నల్లని టీ షర్ట్ లో కన్పిస్తున్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫొటోలో కన్పిస్తున్న ఆ కుర్రాడు దేవదాసు సినిమాతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన రామ్. రామ్ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ తమ్ముడు అయినా పోతినేని మురళి కుమారుడు.

రామ్ హైదరాబాద్ లో పుట్టిన విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే జరిగింది. రామ్ దేవదాసు సినిమాలో నటించేటప్పటికీ చాలా చిన్న వయస్సు. అంతేకాకుండా రామ్ తన డాన్స్ తో అందరిని ఆకట్టుకొని ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.

దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆ సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. రామ్ తనదైన శైలిలో డాన్స్ లు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రామ్ దేవదాసు సినిమా హిట్ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన జగడం ప్లాప్ అయ్యింది.

రామ్ తన పెద్దనాన్న స్రవంతి రవికిశోర్ అండతో సినీ పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాడు. రామ్ మూడో సినిమా రెడీ…శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో రామ్ కెరీర్ లో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత చేసిన మస్కా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత చేసిన సినిమాలతో తనదైన మార్క్ ని క్రేయేట్ చేసుకోవటంలో రామ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.