క్షణాల్లో ఒత్తిడి,తలనొప్పి,ఆందోళన తొలగిపోయి బాడీ యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా మారుతుంది

Best refreshing drink In Telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఉన్న సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం ఉన్న బిజీ జీవనశైలిలో ఒత్తిడి అనేది చాలా కామన్ గా ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. .
carrot beetroot juice
ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏ పని పైన దృష్టి పెట్టలేరు. అలాగే ఒత్తిడి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు .ఒత్తిడి నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే ఒత్తిడి క్షణాల్లో మాయమై శరీరమంతా యాక్టివ్ గా మారుతుంది.
jaggery Health benefits in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి. నీరు కాస్త వేడెక్కాక ఒకటిన్నర స్పూను బీట్రూట్ తురుము వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము. అర స్పూన్ యాలకుల పొడి. అర స్పూన్ దాల్చిన చెక్క పొడి. అర స్పూన్ ధనియాల పొడి. చిటికెడు వేగించిన జీలకర్ర పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వడకట్టి చిటికెడు పింక్ సాల్ట్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి చల్లారాక ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టి తాగితే ఒత్తిడి, ఆందోళన వంటివి అన్నీ తొలగిపోతాయి. తలనొప్పి., ఆందోళన, ఒత్తిడి వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి శరీరం యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది.
dhaniyalu
కాస్త ఓపికగా ఇలా డ్రింక్స్ తయారుచేసుకొని తాగితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు. కాబట్టి కాస్త ఓపికగా డ్రింక్ తయారుచేసుకొని తాగండి. ఈ డ్రింక్ ఉదయం సమయంలో తాగితే అలసట,నీరసం వంటివి ఏమి లేకుండా హుషారుగా ఉంటారు. కాబట్టి ఈ డ్రింక్ ని తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.