థాయ్‌ పైనాపిల్‌ ఫ్రైడ్‌ రైస్‌ ఎలా తయారుచేయాలో నేర్చుకుందామా?

కావలసిన పదార్థాలు
పైనాపిల్‌ ముక్కలు- ఒక కప్పు, సగం ఉడకబెట్టిన అన్నం- మూడు కప్పులు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, ఎండుమిర్చి- రెండు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, పనీర్‌- మూడు టేబుల్‌ స్పూన్లు,కోడిగుడ్డు- ఒకటి, సోయాసాస్‌- మూడు స్పూన్లు, కారం- ఒక టేబుల్‌ స్పూను, జీడిపప్పు- పావు కప్పు, మిరియాలు- మూడు,బఠాణీలు, ఎండుద్రాక్ష- పావు కప్పు చొప్పున, కొత్తిమీర- కొద్దిగా, చక్కెర- ఒక టీ స్పూను, నూనె- ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు- తగినంత.

తయారీ విధానం
ఒక పాన్ లో నూనె పోసి వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలు,వెల్లుల్లి రెబ్బలు,ఎండుమిర్చి,మిరియాలు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి. ఆ తర్వాత సోయాసాస్‌, కారం, జీడిపప్పు,పంచదార వేసి ఒక నిమిషం పాటు వేగించాలి. ఆ తర్వాత అన్నం, ఉప్పు వేసి చిన్నమంట మీద 4 నిమిషాలు వేగించాలి. తర్వాత పైనాపిల్‌ ముక్కలు, ఎండుద్రాక్ష, బఠాణీలు కూడా వేసి మరో 5 నిమిషాలు వేగించాలి. ఆఖరున కొత్తిమీర చల్లి పొయ్యి మీద నుంచి దించేయాలి. కారం, తీపి కలిసిన రుచి ఇష్టపడేవారికి థాయ్‌ పైనాపిల్‌ ఫ్రైడ్‌ రైస్‌ బాగా నచ్చుతుంది.