Healthhealth tips in telugu

2 ఆకులు ఒక్క రాత్రిలో మోకాళ్ళ నొప్పులను,కీళ్ల నొప్పులను మాయం చేస్తుంది

Guava Leaves health Benefits In Telugu :జామకాయ గురించి మనకు తెలుసు. జామకాయలో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా మనకు తెలుసు. పేదవాని ఆపిల్ గా పేరొందిన జామకాయ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జామ ఆకులలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Guava leaves good for dengue In Telugu
అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు. రెండు జామ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఉదయం పరగడుపున తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్., విటమిన్స్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి.

జామ ఆకులలో ఉండే పొటాషియం చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వారికి కూడా ఒక మంచి దివ్యౌషధమని చెప్పవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నచోట జామ ఆకులను వేడి చేసి కట్టు కట్టాలి. .
Joint Pains
రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి వస్తున్నాయి. సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఇంటి చిట్కాలను ఫాలో అవ్వొచ్చు. .
Diabetes diet in telugu
అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి. జామ ఆకులు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. జామ ఆకుల కాషాయన్ని తాగుతూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాస్త ఓపికగా చిట్కాలను ఫాలో అవ్వాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.