Healthhealth tips in telugu

ఉదయం ఈ టీ తాగితే ఊహించని ఎన్నో లాభాలు…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Herbal tea Benefits In Telugu : ఉదయం లేవగానే మనలో చాలా మంది కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. అలా తాగకపోతే రోజంతా ఎలానో ఉంటుంది. పనులు కూడా ముందుకు సాగవు. అయితే ఉదయం కాఫీ., టీ లకు బదులుగా ఇప్పుడు చెప్పే హెర్బల్ టీ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
dhaniyalu
హెర్బల్ టీ ప్రతిరోజు తాగుతూ ఉంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపికగా శ్రద్ధ పెడితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి. నీరు కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ ధనియాలు., 10 తాజా పుదీనా ఆకులు, రెండు బిర్యానీ ఆకులు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి.
Health Benefits Of Eating Pudina
ఇలా మరిగించడం వలన ధనియాలు, పుదినా ఆకులు, బిర్యాని ఆకులలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్రీన్ టీ బ్యాగ్ ను వేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి. అంతే హెర్బల్ టీ రెడీ అయినట్టే. ఈ హెర్బల్ టీని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. .
Bay Leaf diabetes
ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీ తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో దగ్గు., జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. .
honey tooth ache
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ హెర్బల్ టీని తాగవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే లో బిపి ఉన్నవారికి కూడా ఈ టీ చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి ఈ టీని తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.