Movies

RX 100 సినిమాను వదులుకొని బాధపడుతున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన మూవీ RX 100మూవీ. ఇందులో యంగ్ హీరో కార్తికేయ,స్లిమ్ బ్యూటీ పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్స్ గా నటించారు. యూత్ ని టార్గెట్ చేసిన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. నాలుగురోజుల్లోనే 5కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ట్రేడ్ విశ్లేషకులను అలాగే మరో ఇద్దరు హీరోలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇద్దరు హీరోలకు ఎందుకు ఆశ్చర్యం వేసిందంటే,ముందుగా ఈ కథను తీసుకుని విజయ్ దేవరకొండ దగ్గరకు, అలాగే మహేష్ బాబు బావ సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళాడట దర్శకుడు అజయ్ భూపతి.కానీ, వీళ్ళిద్దరూ సింపుల్ గా నో చెప్పడంతో కొత్తగా వచ్చిన కార్తికేయ నటించి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.

పెళ్లిచూపులు మూవీ సమయంలోనే దేవరకొండను అజయ్ భూపతి ఆశ్రయించాడట. కథ విన్నాక ఎందుచేతనో డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని మహేష్ బావ సుధీర్ బాబుని కల్సి అజయ్ భూపతి కథ చెప్పాడట. అతడు కూడా మూడు నెలలపాటు సమయం తీసుకుని కూడా హ్యాండ్ ఇచ్చాడట. దాంతో కార్తికేయకు ఛాన్స్ వచ్చింది.

ఇక సీన్ కట్ చేస్తే యూత్ ని విపరీతంగా అలరిస్తూ,భారీ వసూళ్లను RX 100 మూవీ రాబడుతోంది. ఓల్డ్ సబ్జెక్ట్ అనుకుని ఆ ఇద్దరూ రిజెక్ట్ చేసి ఉంటారని అయితే దీని వలన కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే కమర్షియల్ హిట్ కోసం పరితపించి సుధీర్ బాబు మాత్రం మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు.