టమోటా గుజ్జుతో డార్క్ స్కిన్ కు చెక్
వేసవికాలంలో ఎండతాపం ఎక్కువగా వున్న నేపథ్యంలో ఎన్నోరకాల చర్మసమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మసౌందర్యానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మం నల్లబడటం, కంటికింద నల్లటి వలయాలు, సన్-టాన్, డార్క్ స్కిన్, చర్మం పొడిబారిపోవడం.. ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యల నుంచి ఉపశహనం పొందాలంటే అందుకు కొన్ని ఇంటి చిట్కాలు (హోమ్ రెమెడీస్) వున్నాయి.
రాత్రి పడుకునే ముందు టమోటోను మధ్యకు కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. నల్లగా వుండే మచ్చలు కాలక్రమంలో తగ్గుతూ ఒకానొక దశలో పూర్తిగా తొలిగిపోతాయి. నల్లని చర్మం సౌందర్యంవంతంగా మారుతుంది.
ఒక పాత్రలో టమోటో జ్యూస్‌ను తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నిముషాలవరకు అలాగే వుంచుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే డార్క్ స్కిన్ నుంచి ఉపశమనం పొంది.. చర్మం ప్రకాశివంతంగా మారుతుంది.
టమోటోను రెండుగా కట్ చేసి, గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. ఆయిలీ స్కిన్‌కు చెక్ పెట్టవచ్చు.