Healthhealth tips in telugu

ఈ టీ తాగితే శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి శ్వాసకోశ సమస్యలు లేకుండా చేస్తుంది…ఈ సీజన్ లో…

Winter Tea Benefits In telugu : ఈ చలికాలంలో అధిక మంచు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అలాగే ఈ కార్తీక మాసంలో మనలో చాలామంది తలస్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన కూడా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఈ సీజన్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది.
Ginger benefits in telugu
అందువల్ల సీజనల్ గా వచ్చే సమస్యలు అన్ని వచ్చేస్తాయి. అయితే సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించుకోవడానికి. అలాగే వచ్చిన సమస్యలను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే TEa చాలా బాగా సహాయపడుతుంది. ఈ చలికాలంలో రోజు విడిచి రోజు ఈ టీ తాగితే సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి కాస్త వేడెక్కాక ఒక స్పూన్ టీ పొడి, దంచిన ఆరంగుళం అల్లం ముక్క, 1/4 స్పూన్ మిరియాల పొడి, 10 పుదీనా ఆకులు క్రష్ చేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేసి ఒక స్పూన్ తేనె., ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. .
Health Benefits Of Eating Pudina
ఈ మసాలా టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని రోజు విడిచి రోజు తీసుకుంటే శరీరంలో .రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్య ఉన్నవారు తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. .

అలాగే జలుబు, దగ్గు, గొంతు వాపు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి అన్ని రకాల శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి ఈ చలికాలంలో ఈ టీ ని తాగటానికి ప్రయత్నం చేయండి. కాస్త ఓపికగా ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా సీజనల్ గా వచ్చే సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.