Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఈమె తల్లి,తండ్రి ఇద్దరు స్టార్స్ వారు ఎవరో తెలుసా?

కొందరికి సినీ పరిశ్రమ మంచి బ్రేక్ ఇస్తే, మరి కొందరికి కలిసిరాదు. లక్కు అనేది అక్కడ కూడా ఉండాలి మరి. ఇక బాహుబలితో తారాస్థాయికి స్టార్ డం సృష్టించుకున్న ప్రభాస్ సినిమాల్లో ప్రవేశిస్తూ సెంటిమెంట్ గా మంచి పేరే తెచ్చుకున్న్నాడు. ఎందుకంటే తొలిచిత్రం హీరోకైనా సరే, హీరోయిన్ కైనా సరే ఓ సెంటిమెంట్ గా నిలుస్తుంది కదా.

టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తూ నటించిన తొలిచిత్రం ఈశ్వర్. ఈ మూవీలో హీరోయిన్ గా ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్న శ్రీదేవి అనే అమ్మాయి పరిచయం అయింది. ఆచిత్రంలో జూనియర్ శ్రీదేవి చాలా క్యూట్ గా నటించింది. ప్రభాస్ సరసన ఎంతోసహజంగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే,ఒకప్పటి అందాల నటి మంజుల, ప్రముఖ నటుడు విజయకుమార్ దంపతుల చిన్న కుమార్తె. జూనియర్ శ్రీదేవిగా పేరుతెచ్చుకున్న ఈమె విజయకుమార్ కూతుళ్ళ అందరిలో చాలా పేమస్ అని చెప్పాలి.

తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్,జెమిని గణేశన్ ల తర్వాత స్టార్ హీరోగా విజయకుమార్ పేరుతెచ్చుకుంటే, మంజుల తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. విజయకుమార్ , మంజుల ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. నిజానికి అప్పటికే విజయకుమార్ కి పెళ్ళై, కవిత, అనిల్ కుమార్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇందులో అనిల్ కుమార్ సౌత్ లో విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు.

ఇక మంజుల, విజయకుమార్ లకు వనిత,రుక్మిణి,శ్రీదేవి జన్మించారు. ఇందులో వనిత, రుక్మిణి పలు సినిమాల్లో హీరోయిన్స్ గా చేసారు. నిజానికి తమ కూతుళ్లను బాలనటులుగా చిత్ర రంగ ప్రవేశం చేయించారు విజయకుమార్.,మంజుల దంపతులు.రిక్షా మామ మూవీతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఆ తర్వాత తెలుగులో వచ్చిన రుక్మిణి చిత్రంలో రుక్మిణి చిన్నప్పటి పాత్రలో నటించింది.

ఇక ఆతర్వాత ఈశ్వర్ మూవీతో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా తొలిచాన్స్ దక్కించుకుంది. ఇది హిట్ అయినప్పటికీ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళంలో దృష్టి పెట్టింది. అక్కడ కూడా తగిన ఛాన్స్ లు రాకపోవడంతో 2009లో పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది. హైదరాబాద్ కి చెందిన రాహుల్ తో అంత్యంత వైభవంగా జరిగిన శ్రీదివి పెళ్లికి సినీ రాజకీయ రంగాలకు చెందిన చాలామంది వచ్చారు.

ఆమెకు వివాహమైన కొన్నాళ్లకే తల్లి మంజుల అనారోగ్యంతో మరణించడం, విజయకుమార్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది.
ఇక ఆ తర్వాత విజయ కుమార్ తేరుకుని, శ్రీదేవి సీమంతం కూడా ఘనంగానే జరిపించారు. పెళ్ళైన ఏడేళ్ల తర్వాత శ్రీదేవికి పుట్టిన బిడ్డకు రూపిక అనే పేరు పెట్టుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో భర్తతో కల్సి చాలా హ్యాపీగా వున్న శ్రీదేవి, తన తల్లిని కుమార్తెతో చూసుకుంటూ, కూతురే లోకంగా జీవిస్తోంది. అయితే త్వరలో సినీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తానంటున్న శ్రీదేవి ఎలాంటి రోల్స్ తో అలరించనుందో చూడాలి.