Movies

దేశముదురు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు… లాభం ఎన్ని కొట్లో ?

Desamuduru Movie details :సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టపడితే అంతటి ఉన్నత స్థాయికి చేరవచ్చు. అల్లు అర్జున్ కూడా అతడు పడిన కష్టాన్ని హీరోగా నిలబెట్టింది. అందులో ముఖ్యంగా దేశముదురు సినిమా ఒకటి. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. 2003లో శివమణి సమయంలో సుమంత్ కోసం ఓ స్టోరీ రెడీ చేయమని చెప్పడంతో ఓ లైన్ సుమంత్ కి వినిపిస్తే, రెస్పాన్స్ రాకపోవడంతో దాన్ని పక్కన పెట్టేసాడు.

2006లో పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే మిస్టర్ శ్రీకాంత్ అనే చిన్న సినిమా చేసి, తర్వాత అల్లు అర్జున్ సినిమాపై దృష్టిపెట్టాలని అనుకున్నాడు. అయితే శ్రీకాంత్ మూవీ ఆగిపోయింది. కాగా అప్పటికే మూడు హిట్స్ తర్వాత ప్లాప్ రావడంతో జాగ్రత్తగా ఆలోచించాలని బన్నీ అనుకున్నాడు.

అందులో భాగంగా శివకాశి అనే తమిళ మూవీని రీమేక్ చేయాలని భావిస్తున్న తరుణంలో పూరి జగన్నాధ్ కల్సి స్టోరీ చెప్పాడు. అయితే ఎప్పుడో సుమంత్ కోసం అనుకున్న స్టోరీనే డవలప్ చేసి చెప్పాడు. ఒక క్రైమ్ రిపోర్టర్ నేపాల్ వెళ్లి అక్కడ ఓ లేడి సన్యాసిని కల్సి ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని, ఆమెను కాపాడడం సారాంశం.

అయితే దీన్ని కొంచెం చేంజ్ చేసి, నేపాల్ బ్యాక్ డ్రాప్ కాకుండా హిమాచల్ ప్రదేశ్ బేక్ డ్రాప్ పెట్టేసారు. ఇక బాలీవుడ్ లో సిక్స్ పాక్ గురించి డిమాండ్. టాలీవుడ్ లో అంతసీన్ లేదని ఓ హీరోయిన్ చేసిన కామెంట్ బలంగా నాటుకుంది. సమయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పూరి మూవీ రావడంతో ఒకే చెప్పాడు.

సిక్స్ పాక్ కూడా చేయడానికి సిద్ధం అయ్యాడు. తారాగణం సెలెక్ట్ కానీ సెంటిమెంట్ ప్రకారం కొత్త హీరోయిన్ కావాలి. దాంతో బాలనటిగా నటించిన,16ఏళ్ళ వయసొచ్చేసరికి హన్సిక యాడ్స్ చేస్తోంది. ఆమెను పెట్టుకోవాలని అడిగితె ఆమె తల్లి నో చెప్పింది. మొత్తానికి కథ చెప్పి ఒప్పించాడు పూరి.

దేశముదురు టైటిల్ పెట్టి, చక్రి మ్యూజిక్ డైరెక్టర్ సెలక్ట్ చేసారు. 2006జూన్ 18న ముహూర్తం కూడా చేసారు. రోజూ 4గంటలు వర్కవుట్ చేసి, తక్కువ సమయంలో సిక్స్ పాక్ చేసిన తొలిసౌత్ హీరోగా బన్నీ నిలిచాడు. హైదరాబాద్ స్టూడియోస్, విశాఖ, హిమాచల్ ప్రదేశ్ లలో 72పనిదినాల్లో షూటింగ్ చేసారు. 10కోట్లు బడ్జెట్. డిసెంబర్ 25న ఆడియో రిలీజ్ హంగామా.

2007జనవరి 12న భారీగా 500థియేటర్స్ లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అదే రోజు ప్రభాస్ యోగి రిలీజ్. బన్నీ డిఫరెంట్ మేనరిజం, డాన్స్ ,ఫైట్స్, డైలాగ్స్, హెయిర్ స్టైల్.. ఇలా అన్నీ అదుర్స్. అంతకుముందు వేరు, దేశముదురు బన్నీ వేరు అనేలా మారిపోయింది.

స్టైలిష్ స్టార్ అవ్వడానికి ఈ మూవీ దోహదం చేసింది. హన్సిక గ్లామర్ యూత్ ని కట్టిపడేసింది. పూరి టేకింగ్, చక్రి మ్యూజిక్ అదిరిపోయాయి. రంభ ఐటెం సాంగ్ అలరిస్తుంది. వారానికే 12కోట్లు షేర్. 243సెంటర్స్ లో50రోజులు,129కేంద్రాల్లో 100రోజులు ఆడింది. 23కోట్ల షేర్ కలెక్ట్ చేసి, ఘనవిజయాన్ని అందుకుంది.