దేవీ పుత్రుడు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు
Venkatesh Devi Putrudu Movie :అప్పటి కిడ్స్ కి స్వీట్ మెమరీ మూవీ గా నిల్చిన దేవిపుత్రుడు ప్లాప్ టాక్ తెచ్చుకున్నా అంత్యంత సాంకేతిక విలువలతో , గ్రాఫిక్స్ తో రూపుదిద్దుకుంది. వెంకటేష్, కోడి రామకృష్ణ, ఎం ఎస్ రాజు కాంబోలో వచ్చిన ఈ మూవీ దాదాపు 15కోట్ల రూపాయలతో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి తీశారు.
2000 డిసెంబర్ 21న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2001 సంక్రాంతికి వాయిదా పడింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ తో ఆడియో మంచి టాక్ తెచ్చుకుంది. నైజాంలో 5కోట్లు కి అమ్ముడైన ఈ మూవీ మొత్తం ప్రీరిలీజ్ బిజినెస్ 18కోట్లు చేసింది. వెంకీ మంచి క్రేజ్ లో ఉండగా, సౌందర్యంతో జోడీ.
భారీ అంచనాలతో రిలీజైన దేవిపుత్రుడు మూవీ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అన్నీ బాగున్నా ప్లాప్ టాక్ తో 8కోట్లు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. చిన్నపిల్ల, గ్రాఫిక్స్, సముద్రంలో మునిగిన ద్వారకా ఓపెనింగ్ ఇలా అన్నీ ఆకట్టుకునేలా ఉన్నా, ఎక్కడో తేడా కొట్టేసింది. అంజలా జవేరి రెండో హీరోయిన్ గా ఉంది.
సినిమా ప్లాప్ కావడంతో ఈ సినిమాలో మణిశర్మ సాంగ్స్ బాగున్నా సరే, సినిమా ప్లాప్ వలన ప్రజాదరణ కోల్పోయాయి. ఈ సినిమా రిలీజైన 10రోజులకే గుజరాత్ లో వచ్చిన భూకంపం యాదృచ్చికంగా నిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకీతో 25కోట్లతో అంజనీ పుత్రుడు మూవీ తీయాలని ఎం ఎస్ రాజు ఆలోచన కూడా మూవీ ప్లాప్ తో వెనక్కి పోయింది.
తండ్రి కొడుకులుగా వెంకీ నటించాలి. కానీ గ్రాఫిక్స్, షూటింగ్ అన్నీ ఆలస్యం అవుతాయని, బడ్జెట్ పెరిగిపోతుందని చెప్పడంతో మార్పులు చేసి త్వరగానే షూటింగ్ పూర్తి చేసేసారు. ఒరిజనల్ కథతో తీస్తే పదేళ్లు పడుతుందని స్వయంగా ఎంఎస్ రాజు చెప్పడాన్ని బట్టి ఇందులో కీలకమైన అంశాలు దెబ్బతినేసాయి.
అందుకే తేడా కొట్టింది. ఇక భారీ అంచనాలు, సమ్మర్ లో రావాల్సిన మూవీ సంక్రాంతికి రావడం, ఇక నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ముందు నిలబడలేకపోవడం, ఇలా ఎన్నో కారణాల వలన సినిమా దెబ్బతినేసింది. కానీ సినిమా ఇప్పుడు చూసినా సూపర్ గా ఉంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలి.